*కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయముకు వచ్చు భక్తులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు ఆలయ తెరుచు వేళలు: ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6.30 వరకు మాత్రమే ప్రతి ఒక్కరు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకొని, థర్మల్ స్కానింగ్ అనంతరం లోనికి రావలెను. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి మాత్రమే ఆలయం లోనికి రావలెను. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించవలెను. దేవస్థానం నందు అన్నదానం, ప్రసాద వితరణ నిలుపుదల చేయడమైనది. మన జాగ్రత్తతో కరోనాను ప్రాలదోలుదాం - కార్యనిర్వాహణాధికారి *ఈ ఆలయం పేరుతో విరాళములు కోరుతూ ఆన్లైన్ నందు ఎటువంటి వెబ్సైట్ గానీ, ఫేస్ బుక్ పేజీగానీ, ఫోన్ పే, గూగుల్ పే గానీ లేవు. విరాళములు మరియు ఆభరణములు ఇచ్చువారు ఆలయం వద్ద మాత్రమే చెల్లించి తగురశీదు పొందవలెను. ఎవరైనా వ్యక్తులు, సంస్ధలు విరాళములు అడిగినచో 8519992475 నకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవలసిందిగా తెలియజేయడమైనది. - కార్యనిర్వహణాధికారి
Information & News సమాచారం మరియు వార్తలు

కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయముకు వచ్చు భక్తులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు

ఆలయ తెరుచు వేళలు:

ఉదయం 6.30 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6.30 గంటల వరకు మాత్రమే

ప్రతి ఒక్కరు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకొని, థర్మల్ స్కానింగ్ అనంతరం లోనికి రావలెను.

ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి మాత్రమే ఆలయం లోనికి రావలెను.

ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించవలెను.

దేవస్థానం నందు అన్నదానం, ప్రసాద వితరణ, నిలుపుదల చేయడమైనది.

మన జాగ్రత్తతో కరోనాను ప్రాలదోలుదాం -
కార్యనిర్వాహణాధికారి

చేయవలసినవి:

ఆలయం లోపల సంపూర్ణ నిశ్శబ్దంగా ఉండాలి మరియు ఓం నమో శృంగారవల్లభ " అని స్మరించాలి. సహ యాత్రికులను గౌరవించండి . ఆలయ విధి విధానాలను అనుసరించండి మరియు మీ వంతు స్వామియొక్క దర్శనం కోసం వేచి ఉండండి. మీ సమర్పణలను హుండీ లో మాత్రమే వేయండి.

 Things to do:

Inside the temple, there should be complete silence and remembrance of "Om Namo Shrisrungaravallabha". Respect the fellow pilgrims. Follow the temple rituals and wait for your turn for Dharan. Place your offerings in hundi only.

చేయకూడనివి:

మాంసాహారం, మద్యం లేదా ఇతర మత్తుపదార్ధాలు సేవించరాదు. దూమపానం నిషేధం. పాదరక్షలు ధరించరాదు మరియు ఆలయ ప్రాంగణంలో వాహనములకి ప్రవేశము లేదు. శీఘ్ర దర్శనానికి దళారులను సంప్రదించకూడదు. దర్శనానికి తొందర పడకండి. క్యూ పద్దతిని మాత్రమే పాటి౦చండి. ఆలయం లోపల పొర్లుద౦డాలు, సాష్టాంగ నమస్కారం చేయరాదు. వీధి విక్రేతల నుండి కల్తీ ప్రసాదం కొనవద్దు. ఆలయ ప్రాంగణంలో ఉమ్మరాదు. హిందూ సాంప్రదాయ ప్రకారం దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయ ఆవరణలోకి శిరస్త్రాణాలు, టోపీలు, తలపాగాలు వంటివి ధరించి రాకూడదు. ఆలయం లోపలికి ఎలాంటి ఆయుధాలు తీసుకురాకూడదు. బయట నుండి తెచ్చిన ఆహారం ఆలయ ప్రాంగణంలో తినకూడదు. మీ సంపద, డబ్బు మరియు స్థితి గురించి మాట్లాడటానికి వీలులేదు. ఆలయ ప్రాంగణంలో తగాదా పడకూడదు. ఆలయ ప్రాంగణంలో హింస మరియు చట్టవిరుద్దమైన పనులు చేయకూడదు. ఆలయ ప్రాంగణంలో నిద్ర పోకూడదు. ఆలయం, మండపం మరియు గోపురముల  పైకి ఎక్కరాదు.

Things not to do:

Do not consume meat, alcohol, or other drugs. Prohibition of smoking. Shoes should not be worn and vehicles should not have access to the temple premises. Troops should not be contacted for a quick visit. Do not bother with the vision. Follow the queue method only. Wands and prostrations should not be performed inside the temple. Do not buy counterfeit offerings from street vendors. Not to be missed in the temple courtyard. One has to enter the temple dressed according to Hindu tradition. Helmets, hats, and turbans should not be worn inside the temple premises. No weapons should be brought inside the temple. Food brought from outside should not be eaten in the temple premises. Unable to talk about your wealth, money, and status. No quarrel should take place in the temple premises. Violence and illegal activities should not be allowed in the temple premises. Do not sleep in the temple courtyard. Do not climb on top of the temple, porch, and domes.AutoMov